kishan Reddy: ఇవన్నీ ఉండి కూడా చంద్రబాబు ఓడిపోయారు: కేసీఆర్ కు గుర్తు చేసిన కిషన్ రెడ్డి

KCR is politicising everything says Kishan Reddy
  • ప్రతి విషయాన్ని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు
  • కేంద్రం ఎన్ని చేసినా.. ఏమీ చేయలేదంటున్నారు
  • వరి విషయంలో ఏపీలో లేని సమస్య కేసీఆర్ కే ఎందుకొస్తోంది?
ప్రతి విషయాన్ని కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా... ఏమీ చేయలేదని కేసీఆర్ చెపుతుండటం దారుణమని అన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో వరి ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని... కానీ కేసీఆర్ కు మాత్రమే సమస్య ఎందుకొస్తోందని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొంటామని గతంలో చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. డబ్బులతో, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతి ఎన్నికలో గెలుస్తామని అనుకోవడం భ్రమ అవుతుందని అన్నారు. ఇవన్నీ ఉండి కూడా చంద్రబాబు ఓడిపోయారనే విషయాన్ని గుర్తు చేశారు.
kishan Reddy
BJP
KCR
TRS
Chandrababu
Telugudesam

More Telugu News