Just Tickets: ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల బుకింగ్ కోసం రెండు సంస్థల పోటీ.. రేసులో అల్లు అరవింద్ తనయుడు

Allu Venkatesh Tenders AP Online tickets booking bids
  • టికెట్ల విక్రయం కోసం టెండర్లు ఆహ్వానించిన ఏపీఎస్‌ఎఫ్‌టీడీసీ
  • జస్ట్ టికెట్స్, బుక్‌మై షో కలిసి మరో సంస్థ టెండర్లు
  • ప్రతి టికెట్‌పై ఒకటి 90 పైసలు, మరోటి 75 పైసల చొప్పున చెల్లించేందుకు కోట్
  • త్వరలోనే టెండర్ల ఖరారు
ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించేందుకు రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ కూడా ఉన్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను నిర్వహించేందుకు ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్‌టీడీసీ) టెండర్లను ఆహ్వానించింది. 

ఈ క్రమంలో అల్లు వెంకటేశ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జస్ట్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు, బుక్‌మై షోతో కలిసి మిడిల్ ఈస్ట్ ఏషియాలో వ్యాపారం నిర్వహిస్తున్న మరో సంస్థ బిడ్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. 

ఒక్కో టికెట్‌పై ప్రభుత్వానికి 90 పైసలు చెల్లించేందుకు ఓ సంస్థ, 75 పైసల చొప్పున చెల్లించేందుకు మరో సంస్థ కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లోనే టెండర్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
Just Tickets
Allu Venkatesh
Andhra Pradesh
APSFTDC
Book My Show

More Telugu News