Amit Shah: తెలంగాణ‌కు అమిత్ షా.. ఒకే నెలలో రెండు పర్యటనలు

union home minister amit shah willtoir telengana in april
  • ఏప్రిల్‌ నెల‌లోనే రెండు ప‌ర్య‌టన‌లు
  • ఏప్రిల్ 10న భ‌ద్రాద్రికి అమిత్ షా
  • అదే రోజున భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి ద‌ర్శ‌నం
  • 14న మ‌రోమారు తెలంగాణ‌కు రానున్న అమిత్ షా
  • బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ను ప్రారంబించ‌నున్న‌ వైనం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌చ్చే నెల‌లో రెండు పర్యాయాలు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఏప్రిల్ 10న తెలంగాణ‌కు రానున్న అమిత్ షా.. శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భ‌ద్రాచ‌లం వెళ్ల‌నున్నారు. సీతారాముల పెళ్లి వేడుక‌కు ఆయ‌న ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తారు. అదే రోజున ఆయ‌న పాత‌బ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌యాన్ని కూడా సంద‌ర్శించ‌నున్నారు.

రెండు ఆల‌యాల ద‌ర్శ‌నం ముగిశాక హైద‌రాబాద్ చేరుకునే అమిత్ షా ప‌లువురు మేధావుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ప‌లువురు ఇత‌ర పార్టీల నేత‌ల‌తోనూ అమిత్ షా స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి ఢిల్లీ వెళతారు.

ఇక రెండో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏప్రిల్ 14న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు అమిత్ షా రానున్నారు. 14న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌న పాద‌యాత్ర రెండో విడ‌త‌ను గ‌ద్వాల నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ యాత్ర‌ను ప్రారంభించేందుకే అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు.
Amit Shah
Telangana
Bhadrachalam
Bandi Sanjay
BJP

More Telugu News