Shanghai: చైనాలో మరింత విజృంభిస్తున్న కరోనా... లాక్ డౌన్ లోకి షాంఘై మహానగరం

  • చైనాలో మళ్లీ కరోనా పంజా
  • షాంఘై నగరంలో నిన్న 3,450 కొత్త కేసులు
  • నగర జనాభా 2.6 కోట్లు
  • అందరికీ కరోనా పరీక్షలు చేయనున్న అధికారులు
  • లాక్ డౌన్ ప్రకటనతో సూపర్ మార్కెట్లు కిటకిట
  • ఒక్కరోజులో సరుకంతా ఖాళీ!
Corona spreads rapidly in China city Shanghai

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా వేలాదిగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తొలిసారిగా వెల్లడైంది చైనాలోనే అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఎంతో కట్టడి చేసిన చైనాలో ఇటీవల మళ్లీ కరోనా వ్యాప్తి పుంజుకుంది. ఇప్పటికే అనేక నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా, తాజాగా షాంఘై మహానగరంలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. 

ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసర వస్తువులను తామే ఇళ్ల సమీపానికి చేరుస్తామని, అక్కడ్నించి ప్రజలు తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు నిలిపివేయాలని, పరిశ్రమలు, కార్పొరేట్ ఆఫీసులు మూసివేయాలని ఆదేశించారు. షాంఘై నుంచి రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. 

సోమవారం నుంచి లాక్ డౌన్ అని ప్రకటించడంతో, ప్రజలు నిన్న సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దాంతో సూపర్ మార్కెట్లలోని సరుకు ఒక్కరోజులోనే ఖాళీ అయింది. షాంఘై జనాభా 2.6 కోట్లు. నిన్న ఒక్కరోజే 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో, నగరంలోని జనాభా అంతటికి కరోనా పరీక్షలు చేయాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

More Telugu News