Vijay Devarakonda: మరోసారి పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda and Puri new movie update
  • ముగింపు దశలో 'లైగర్'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • ఆగస్టు 25వ తేదీన విడుదల 
  •  ఇదే  కాంబినేషన్లో మరో ప్రాజెక్టుకి సన్నాహాలు

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరి - కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మైక్ టైసన్ మెరవనుండటం విశేషం. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేననే క్లారిటీ కొంతసేపటి క్రితమే వచ్చింది. విజయ్ దేవరకొండ - పూరి నెక్స్ట్ మిషన్ త్వరలో మొదలవుతుందనీ, దానికి సంబంధించిన సమాచారాన్ని రేపు వెల్లడి చేస్తామంటూ అధికారిక పోస్టర్ ను వదిలారు.

గతంలో మహేశ్ తో చేయాలనుకున్న 'జన గణ మన' కథను విజయ్ దేవరకొండతో పూరి చేయనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఆ కథేనా? వేరేదా? అనేది పూరి చెప్పాలి. ఒక దర్శకుడితో వెంటనే మరో సినిమా చేయడమనేది తమిళంలో అజిత్ కి అలవాటు. విజయ్ దేవరకొండ ఇక్కడ ఆ ఆనవాయితీని కొనసాగిస్తాడేమో చూడాలి.

  • Loading...

More Telugu News