Anushka Shetty: చాలా రోజుల తర్వాత బయట కనిపించిన అనుష్క!

Anushka Shetty appeared after a long time in RRR party
  • 'ఆర్ఆర్ఆర్' విజయోత్సవ పార్టీకి హాజరైన అనుష్క
  • అనుష్కను ప్రత్యేకంగా ఆహ్వానించిన రాజమౌళి
  • ఏడాదిన్నర క్రితం వచ్చిన అనుష్క చివరి సినిమా 
టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అనుష్క ఈ మధ్య స్లో అయింది. 40 ఏళ్ల వయసుకు చేరుకోవడం, యంగ్ హీరోయిన్లతో విపరీతమైన పోటీ ఉండటంతో... ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె బయట కనిపించడం కూడా తగ్గిపోయింది. అయితే, తాజాగా చాలా కాలం తర్వాత అనుష్క బయటకు వచ్చింది. 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘన విజయం నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ సెలబ్రేషన్లలో మునిగి తేలుతోంది. తాజాగా జరిగిన ఓ పార్టీకి తారక్, ఆయన భార్య ప్రణతి, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, దిల్ రాజు, రాజమౌళి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి అనుష్కను రాజమౌళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు అనుష్క ఈ కార్యక్రమంలో పాల్గొంది. 

ఈ పార్టీలో రామ్ చరణ్ తో అనుష్క మాట్లాడుతున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనుష్క చివరి సారిగా 'నిశ్శబ్దం' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి ఆమె కొత్త చిత్రం రాలేదు. అయితే ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నట్టు సమాచారం.
Anushka Shetty
Tollywood
Public Appearance
RRR
Rajamouli
Party

More Telugu News