Indian Students: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు

Ukraine returned Indian students files petition in Supreme Court

  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత విద్యార్థులు
  • మధ్యలోనే ఆగిన కోర్సులు
  • భారత్ లోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పించాలన్న విద్యార్థులు

రష్యా దండయాత్ర నేపథ్యంలో భారత్ కు చెందిన వేలమంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. వీరందరినీ ఎంతో కష్టమ్మీద కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు తాజాగా సుప్రీంకోర్టు గడప తొక్కారు. 

ఉక్రెయిన్ లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమకు స్వదేశంలోనే చదువుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ వర్సిటీలో రెక్టార్ గా ఉన్న దివ్య సునీతరాజ్, 50 మంది విద్యార్థులు ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత్ లోనే కోర్సు పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 

ఇలాంటి పరిణామాలు తలెత్తినప్పుడు ఏంచేయాలో నిబంధనలు రూపొందించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. సుమారు 2 వేల మంది విద్యార్థులకు న్యాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థుల తరఫున న్యాయవాది రమేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News