RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ నేపాల్ లో మామూలుగా లేదుగా.. తమిళనాడు సేలంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం.. ఇవిగో వీడియోలు

Nepal Fans Dance For RRR Movie In Theatres Videos Go viral
  • నేపాల్ థియేటర్ లో డ్యాన్సులేసి కేరింతలు కొట్టిన అభిమానులు
  • నిన్న రాత్రి సేలంలోని థియేటర్ వద్ద జంక్షన్లన్నీ జామ్
  • టికెట్ల కోసం ఎగబడిన అభిమాన సంద్రం
ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు, తమిళం, హిందీనే కాదు.. విదేశాల్లోనూ ఆ సినిమా రఫ్ఫాడించేస్తోంది. చల్లటి హిమాలయ దేశం నేపాల్ లోనూ వేడి పుట్టిస్తోంది. అక్కడ అభిమానులు తెగ చిందులేస్తున్నారు. థియేటర్లలో మోత మోగిస్తున్నారు. స్క్రీన్ల దగ్గరకు వెళ్లి డ్యాన్సులాడుతున్నారు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఇటు తమిళనాడులోని సేలంలో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్ వద్ద ఎగబడ్డారు. నిన్న రాత్రి షో సినిమా టికెట్ల కోసం భారీ సంఖ్యలో జనం థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులతో వీధులు, జంక్షన్లు కిక్కిరిసిపోయాయి. 

చుట్టుపక్కల రోడ్లన్నీ ‘ఆర్ఆర్ఆర్ అభిమాన సంద్రం’గా మారాయి. ఆ అభిమాన సంద్రంలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది. ఆ వీడియోను ఓ అభిమాని పంచుకున్నారు.
RRR
Rajamouli
Junior NTR
Ramcharan
Nepal

More Telugu News