Revanth Reddy: ఒకరి తప్పును ఇంకొకరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on Center and state govt
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఆగ్రహం
  • కేంద్రం పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శ  
  • రాష్ట్రం విద్యుత్ చార్జీలు పెంచిందని ఆగ్రహం
  • జేబుదొంగల్లా మారాయని మండిపాటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం పెట్రోల్ ధర పెంచితే, రాష్ట్రం విద్యుత్ చార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని, పేదలకు సాయం అందించడం మానేసి ప్రభుత్వాలు జేబుదొంగల్లా మారాయని అన్నారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని వెల్లడించారు. రైతుల సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
Revanth Reddy
Center
State Govt
Telangana
Congress
TRS

More Telugu News