Atchannaidu: తెనాలిలో టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: అచ్చెన్నాయుడు

Atchannaidu alleges YCP leaders attacked on TDP leaders in Tenali
  • వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు ధ్వజం
  • వైసీపీ నేతకు స్థలం అమ్మలేదని షాపు కూల్చేశారని ఆరోపణ
  • ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడి చేశారని ఆరోపణ  
  • అక్రమ కేసులు బనాయించారంటూ ఆగ్రహం

తెనాలిలో టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతకు స్థలం అమ్మలేదని దుకాణాన్ని కూల్చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడులు చేయడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. 

తెనాలిలో ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు పెట్టరా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. విద్వేషం, విధ్వంసమే వైసీపీ అజెండా అని విమర్శించారు. బాధితులపైనే అక్రమ కేసులు పెడుతూ, వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News