India: ఇండియాలో 4,100 కరోనా మరణాలు.. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎందుకంటే..!

India logs 1660 new corona cases
  • గత 24 గంటల్లో 1,660 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 2,349 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,741
ఇండియాలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,660 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,100 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే పలు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన, లెక్కల్లో చూపని మరణాలను ఈ సంఖ్యకు జత చేసినట్టు తెలిపింది. మహారాష్ట్రలోని 4,700 మరణాలు, కేరళలోని 81 మరణాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది.

ఇక దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,82,87,68,476 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు.
India
Corona Virus
Updates

More Telugu News