Vivek Agnihotri: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు.. 'భోపాలీ' పదానికి వివేక్ చెప్పిన అర్థంపై ఆగ్రహం!

Row over Vivek Agnihotris Bhopali Means Homosexual Remark
  • తాను భోపాల్ వాడినన్న విషయాన్ని ఎక్కడా చెప్పనన్న వివేక్ అగ్నిహోత్రి
  • భోపాల్ ప్రజల్లో నవాబుల ప్రవర్తన ఉంటుందన్న దర్శకుడు
  • బహుశా ఆయనకు అలాంటి అలవాటు ఉండొచ్చన్న దిగ్విజయ్ సింగ్

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భోపాలీ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తానూ భోపాల్ వాడినేనని.. కానీ, తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని పేర్కొన్నారు. అలాగే నవాబుల ప్రవర్తన అని కూడా అర్థముందని అన్నారు. 

వివేక్ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో విమర్శలు చుట్టుముట్టాయి. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ ఆయన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News