Chandrababu: 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానం... ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu unveils special logo for TDP Forty years celebrations
  • టీడీపీకి 40 వసంతాలు
  • ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న చంద్రబాబు
  • పార్టీ కోసం పునరంకితం అయ్యేలా వేడుకలు ఉండాలని నిర్దేశం
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తుచేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు టీడీపీని స్థాపించారని వివరించారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ... తెలుగుదేశం అని స్పష్టం చేశారు. టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రానికి టీడీపీ అవసరం ఏంటో ప్రజలకు వివరించాలని అన్నారు.
Chandrababu
TDP
Logo
Formation Day
Andhra Pradesh

More Telugu News