Yogi Adityanath: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం... హాజరైన మోదీ, అమిత్ షా

Yogi Adityanath takes oath as Uttar Pradesh CM for record second time
  • ఇటీవల యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఘనవిజయం సాధించిన బీజేపీ
  • వరుసగా రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్
  • 37 ఏళ్లలో ఇదే ప్రథమం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో పర్యాయం ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. యూపీలో గత 37 ఏళ్లలో వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తి యోగి ఒక్కరే. లక్నో స్టేడియంలో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ నటులు కూడా తళుక్కుమన్నారు. 

కాగా, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఆయననే డిప్యూటీ సీఎంగా కొనసాగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇక, ఇవాళ్టి ప్రమాణస్వీకారోత్సవంలో యోగి కాకుండా 52 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 255 చోట్ల జయభేరి యోగించింది.
Yogi Adityanath
CM
Oath
BJP
Uttar Pradesh

More Telugu News