Allu Arjun: హిందీ రీమేక్ దిశగా 'దువ్వాడ జగన్నాథం'!

Duvvada Jagannadham Remake
  • తెలుగులో  హిట్ కొట్టిన 'డీజే'
  • హిందీ రీమేక్ కి సన్నాహాలు 
  • హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా 
  • ఆ తరువాతనే సెట్స్ పైకి 'భవదీయుడు'
హరీశ్ శంకర్ కొంతకాలంగా పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్లో 'భవదీయుడు భగత్ సింగ్'  సినిమాను రూపొందించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుని ఉన్నాడు. కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసుకున్న ఆయన, వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టాలనుకున్నాడు. 

అయితే అనుకున్న సమయానికి 'హరి హర వీరమల్లు' సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోవలసింది. కానీ ఏదో ఒక కారణంగా జాప్యం జరుగుతూనే ఉంది. వచ్చేనెలలో కూడా షూటింగు మొదలవుతుందనే గ్యారెంటీ లేదు. 

దాంతో హరీశ్ శంకర్ .. 2017లో తన దర్శకత్వంలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. తెలుగులో  ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ముందుకు వెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడట.
Allu Arjun
Pooja Hegde
Duvvada jagannatham Movie

More Telugu News