Obulesu: ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ప్రాణాలు వదిలిన వ్యక్తి

Man dies while watching RRR movie in Anantapur
  • ఆర్ఆర్ఆర్ ప్రదర్శనలో అపశ్రుతి
  • గుండెపోటుకు గురైన వ్యక్తి
  • ఆసుపత్రికి తరలించే లోపే మృతి
  • విషాదంలో కుటుంబ సభ్యులు, మిత్రులు
అనంతపురంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తుండగా విషాద ఘటన జరిగింది. అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ప్రాణాలు వదిలాడు. 30 ఏళ్ల ఓబులేసు థియేటర్లో తన సెల్ ఫోన్లో చిత్రీకరణ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అతడి కుటుంబ సభ్యులు, మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Obulesu
Death
RRR
Anantapur

More Telugu News