Road Accident: ఆ పిల్లాడు కొద్దిగుంటే బస్సు చక్రాల కింద పడేవాడే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

Kerala Boy Luckily escapes Unhurt
  • కేరళలో బైక్ ను ఢీకొట్టి ఎగిరి పడిన బాలుడు
  • బస్సు చక్రాల కింద పడకుండా త్రుటిలో తప్పించుకున్న వైనం
  • బాలుడి సైకిల్ పైకి ఎక్కేసిన బస్సు
కేరళకు చెందిన 9 ఏళ్ల బాలుడు అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం (మార్చి 24) సాయంత్రం.. ఆ కుర్రాడు ఆడుకుంటూ సైకిల్ తీశాడు. ఇంటి నుంచి బయల్దేరి వేగంగా తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు వరకు చేరుకున్నాడు. వేగంగా వచ్చి అదుపు తప్పాడు.. కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న బైకును ఢీకొట్టి ఎగిరి రోడ్డవతల పడ్డాడు. 

అయితే, ఆ వెనకే బస్సు వస్తోంది. సైకిల్ రోడ్డు మీద పడిపోగా.. చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు. సైకిల్ పైకి బస్సు ఎక్కేసింది. రోడ్డు మీద ఎగిరిపడినా.. చిన్న గాయం లేకుండా బయటపడగలిగాడు. కేరళలోని కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలోని చోరుక్కల వద్ద ఈ ఘటన జరిగింది. 

ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అది చూసిన వాళ్లంతా అమ్మో అనుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ఆ వీడియోను ట్వీట్ చేసి.. కామెంట్ చేయాలంటూ నెటిజన్లను అడిగారు. అంతా తల్లిదండ్రుల పెంపకంలోనే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లలకు కనీస బుద్ధి చెప్పాలని అంటున్నారు. బైక్ అతను దేవుడిలా వచ్చాడని, ఆ బైక్ వల్ల చిన్నారి ఎగిరి అవతల పడ్డాడని లేదంటే బస్సు కింద పడేవాడేనని అంటున్నారు.
Road Accident
Kerala
Bus

More Telugu News