Ramcharan: అల్లూరి సీతారామరాజు వేషధారణలో హైదరాబాదుకు చరణ్ అభిమానులు.. వీడియో ఇదిగో

- ఆర్ఆర్ఆర్‌లో అల్లూరిగా చెర్రీ
- అల్లూరి వేషధారణతో బైక్ ర్యాలీగా వచ్చిన ఫ్యాన్స్
- అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న వేషధారణ
రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు విడుదలైన విషయం తెలిసిందే. బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌కు పలు ప్రాంతాల నుంచి చెర్రీ అభిమానులు 100 మంది అల్లూరి సీతారామ రాజు వేషధారణతో రావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బైకులపై ర్యాలీగా వారు హైదరాబాద్‌కు వచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.