Nara Lokesh: నిస్సిగ్గుగా సీఎం అబద్ధాలు ఆడటం బాధాకరం: లోకేశ్

lokesh slams ycp
  • కల్తీ సారా, జే బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచారు
  • అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామన్న లోకేశ్ 
  • సహజ మరణాలు అంటూ సభా వేదికగా ప్ర‌క‌టించారు
  • కనీసం ఆఖరి రోజైనా హత్యల పై చర్చ చేపట్టాలని కోరుతున్నామన్న లోకేశ్ 
క‌ల్తీ సారా వ‌ల్ల మృతి చెందిన వారికి న‌ష్ట ప‌రిహారం అందించాల‌ని, అవి అన్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. కొన్ని రోజులుగా ఆ ఘ‌ట‌న‌ల‌పై లోకేశ్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఆందోళ‌న‌లు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా టీడీపీ నేత‌లు నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

'కల్తీ సారా, జే బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచారంటూ అసెంబ్లీ ఎదుట శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. సహజ మరణాలు అంటూ సభా వేదికగా నిస్సిగ్గుగా సీఎం అబద్ధాలు ఆడటం బాధాకరం. కనీసం ఆఖరి రోజైనా హత్యలపై చర్చ చేపట్టాలని కోరుతున్నాం. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. కల్తీ సారా, జే బ్రాండ్లు నిషేధించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News