Petrol: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. వారంలో మూడోసారి

Fuel prices hiked by 80 paise for 3rd time this week
  • మళ్లీ 80 పైసల పెంపు
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 97.81
  • అంతకుముందు 137 రోజులపాటు స్థిరంగా ఉన్న ధరలు
137 రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు వారంలో మూడోసారి పెరిగాయి. దీనికి ముందు మంగళవారం, బుధవారం కూడా ధరలు పెరిగాయి. ప్రతిసారి 80 పైసల చొప్పున పెంచడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో ఈ ఉదయం లీటరు పెట్రోలు ధర రూ.97.81కి పెరగ్గా, డీజిల్ ధర రూ.89.07కి చేరుకుంది. 

పెట్రో, డీజిల్ ధరలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్), రవాణా చార్జీలు వంటి స్థానిక పన్నులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య పెట్రో ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉంది.
Petrol
Diesel
price Hike

More Telugu News