Vijay Sai Reddy: సీబీఐకి సాయిరెడ్డి లేఖ‌.. విష‌య‌మేమిటంటే..!

ysrcp mp vijay sai reddy write a letter to cbi director
  • నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు సాయిరెడ్డి లేఖ
  • ర‌ఘురామ‌కృష్ణరాజు కంపెనీపై విచార‌ణ‌ను వేగిరం చేయాల‌ని విన‌తి
  • ఆ కంపెనీ దోచిన ప్ర‌జ‌ల సొమ్మును రిక‌వ‌రీ చేయాల‌ని సూచ‌న‌
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి గురువారం సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ)కి ఓ లేఖ రాశారు. రెండు పేజీల్లో ఉన్న ఈ లేఖ‌ను ఆయ‌న నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు పంపారు. ఈ లేఖ‌లో సాయిరెడ్డి ఓ కీల‌క విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 

వైసీపీకే చెందిన రెబ‌ల్ నేత ర‌ఘురామకృష్ణ‌రాజుకు చెందిన ఇండ్ భార‌త్ ప‌వ‌ర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (ఐబీపీఐఎల్‌)లో చోటుచేసుకున్న అక్ర‌మాల‌పై త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ చేప‌ట్టాల‌ని సాయిరెడ్డి సీబీఐ డైరెక్ట‌ర్‌కు విన్న‌వించారు. అంతేకాకుండా ర‌ఘురామ‌కృష్ణరాజు కంపెనీ దోచేసిన ప్ర‌జ‌ల సొమ్మును రిక‌వ‌రీ చేయాల‌ని కూడా ఆయ‌న సీబీఐని కోరారు.
Vijay Sai Reddy
YSRCP
Raghu Rama Krishna Raju
Ind-Barath Power Infra Limited
IBPIL

More Telugu News