Volodymyr Zelensky: ఉక్రెయిన్ పై రష్యా ఫాస్ఫరస్ బాంబులు వేస్తోందా...?

Zelensky alleges Russia uses Phosphorus bombs on Ukraine
  • నెలరోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్
  • మరింత భీకరంగా రష్యా దాడులు
  • రష్యా రసాయనిక దాడులకు దిగుతోందన్న జెలెన్ స్కీ

గత నెలరోజులుగా ఉక్రెయిన్ ను రష్యా అతలాకుతలం చేస్తోంది. ఉక్రెయిన్ ప్రతిఘటించే కొద్దీ రష్యా దాడులు భీకరరూపు దాల్చుతున్నాయి. అధునాతన అస్త్రాలను సైతం ఉక్రెయిన్ పై ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో రష్యా ప్రమాదకర రసాయనిక దాడులకు దిగుతోందా? అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అవుననే అంటున్నారు. ఉక్రెయిన్ లో రష్యా ఫాస్ఫరస్ బాంబులు ప్రయోగిస్తోందిన జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ దాడుల్లో భారీగా పెద్దవాళ్లు, చిన్నారులు కడతేరిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

రష్యా విశృంఖలంగా దాడులకు తెగబడుతోందని, రష్యాకు దీటుగా నాటో కూడా అదే రీతిలో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో తనకంటే శక్తిమంతమైన కూటమి మరొకటి లేదని నాటో చాటిచెప్పాల్సిన సమయం వచ్చిందని జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. నాటో ప్రతిస్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా ఉక్రెయిన్ ఎంతో ఆశాభావంతో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News