TTD: చెన్నై, బెంగ‌ళూరుల్లో శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ కార్యాల‌యాలు

sri venkateswara bhakti channel offices in chennai and bengaluru
  • తెలుగు స‌హా ప‌లు ప్రాంతీయ భాష‌ల్లోనూ ఛానెల్ ప్ర‌సారాలు
  • త‌మిళ, క‌న్న‌డ ఛానెళ్ల కార్యాల‌యాలు చెన్నై, బెంగ‌ళూరుల్లో ఏర్పాటు
  • ఛానల్ పాలకమండలి సమావేశం తీర్మానం
క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ప్ర‌సారాల కోసం ఏర్పాటు చేసిన శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ కార్యాల‌యాలు ఇక‌పై చెన్నై, బెంగ‌ళూరుల్లోనే ఏర్పాటు కానున్నాయి. ఈ మేర‌కు గురువారం టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన శ్రీవేంక‌టేశ్వ‌ర భక్తి ఛానెల్ పాల‌క మండ‌లి స‌మావేశం తీర్మానించింది. 

శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ తెలుగు ప్ర‌సారాల‌తో పాటు ఇటీవ‌లే క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప్ర‌సారాల‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయా ప్రాంతీయ భాష‌ల‌కు చెందిన భ‌క్తుల్లోకి ఛానెల్ ప్ర‌సారాల‌ను మ‌రింత విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకే త‌మిళ‌, క‌న్న‌డ ఛానెళ్ల ప్ర‌సారాల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌ను చెన్నై, బెంగ‌ళూరుల్లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
TTD
YV Subba Reddy
Sri Venkateswara Bhaksti Channel

More Telugu News