Dhanush: ధనుష్ తో మళ్లీ కలిసే అంశంపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య

Aishwarya remove Dhanush name in twitter handle
  • భర్త ధనుష్ తో విడిపోయిన ఐశ్వర్య
  • తాజాగా తన పేరు వెనుకున్న ధనుష్ ను తొలగించిన వైనం
  • తన పేరును జత చేసిన ధనుష్
తమిళ హీరో ధనుశ్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ విడిపోతున్నట్టు జనవరి 17న వీరు ప్రకటించారు. ఈ వార్త సెన్సేషన్ అయింది. ఇద్దరినీ కలిపేందుకు ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని సమాచారం. 

మరోవైపు ధనుష్ నుంచి విడిపోయినప్పటికీ ట్విట్టర్ ఖాతాలో తన పేరు వెనుక ధనుష్ ను ఆమె తొలగించలేదు. దీంతో, వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉండొచ్చని అభిమానులు భావించారు. అయితే, మళ్లీ కలిసే అంశంపై ఐశ్వర్య పూర్తి క్లారిటీ ఇచ్చారు. 

ట్విట్టర్ ఖాతాలో ఇన్నాళ్లు తన పేరు వెనుక పెట్టుకున్న ధనుష్ ను ఐశ్వర్య తొలగించింది. తన పేరు చివరన తన తండ్రి రజనీకాంత్ పేరును పెట్టుకుంది. దీంతో, ఇకపై ధనుష్ ను మళ్లీ కలిసే అవకాశమే లేదని ఆమె స్పష్టంగా చెప్పినట్టయింది. ప్రస్తుతం ఆమె తన దృష్టిని పూర్తిగా డైరెక్షన్ పైనే పెట్టింది. బాలీవుడ్ లో ఆమె ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది.
Dhanush
Aishwarya
Kollywood
Rajinikanth

More Telugu News