Kukatpalli: బాత్రూమ్ విషయంలో గొడవ.. భార్య ఆత్మహత్య!

Wife commits suicide after argument with husband
  • కూకట్ పల్లిలో విషాదకర ఘటన
  • బాత్రూమ్ కు వెళ్లి నీళ్లు పోయలేదని భర్తను నిలదీసిన భార్య
  • వివాదం నేపథ్యంలో ఫ్యానుకు ఉరి వేసుకున్న భార్య
చిన్నచిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా హైదరాబాదులోని కూకట్ పల్లి లో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... కూకట్ పల్లి న్యూబాలాజీ నగర్ లో నవీన్, శృతి (28) దంపతులు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. నవీన్ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. నవీన్ బాత్రూమ్ కు వెళ్లి మూత్ర విసర్జన చేసి వచ్చాడు. 

అయితే నీళ్లు పోయలేదనే విషయంలో భర్తను శృతి నిలదీసింది. దీంతో, ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆవేదనకు గురైన శృతి పైగదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kukatpalli
Wife
Suicide

More Telugu News