IPL 2022: బుక్ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. రేటు రూ.800 నుంచి ప్రారంభం

ipl tickets sales started in book my show
  • 26 నుంచి ఐపీఎల్ తాజా సీజ‌న్ ప్రారంభం
  • స్టేడియాల్లో 25 శాతం సామ‌ర్థ్యంతో జ‌నానికి అనుమ‌తి
  • టికెట్ల విక్ర‌యాల‌ను ప్రారంభించిన బుక్ మై షో
మ‌రో మూడు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రారంభం కానుంది. క‌రోనా విస్తృతి తగ్గిన నేప‌థ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రిగే స్టేడియాల్లో 25 శాతం మేర సీట్ల‌లో జ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లుగా ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు సంబంధించి టికెట్ల బుకింగ్ కూడా బుధ‌వారం ప్రారంభ‌మైపోయింది. 

సినిమా టికెట్ల బుకింగ్ ప్ర‌ధానంగా సాగుతున్న బుక్ మై షో.. ఐపీఎల్ టికెట్ల‌ను కూడా విక్ర‌యించ‌నుంది. ఈ మేర‌కు ఐపీఎల్ టికెట్ల విక్ర‌య కాంట్రాక్టును ద‌క్కించుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన బుక్ మై షో.. బుధ‌వారం నుంచే టికెట్ల విక్ర‌యాల‌ను ప్రారంభించేసింది. ఇక ఈ మ్యాచ్‌ల టికెట్ల ధ‌ర‌లు రూ.800 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.
IPL 2022
Book My Show
IPL Tickets

More Telugu News