Nara Lokesh: న‌ల్ల కండువాలు ధ‌రించి లోకేశ్ నేతృత్వంలో ఏడో రోజు టీడీపీ నిర‌స‌న‌.. వీడియో ఇదిగో

lokesh slams ycp
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల్తీ సారా మరణాలపై నిర‌స‌న‌
  • కల్తీ సారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు 
  • మద్యనిషేధంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల్తీ సారా మరణాలపై వరుసగా ఏడవ రోజు కూడా టీడీపీ నిర‌సన తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ శాసనసభా పక్ష నేతలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీ సారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

ఏపీలో మద్యనిషేధంపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. అమ‌రావ‌తిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ఈ ర్యాలీ జ‌రిగింది. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో ప్ర‌జ‌లు చనిపోతున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.  

Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News