ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి: ఉత్తర తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ
- రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత
- రాష్ట్రంలో పలుచోట్ల స్వల్పంగా వర్షాలు
చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా మిరాస్‌పల్లిలో అత్యధికంగా 1.3, పెబ్బేరులో 1.1, మహబూబ్‌నగర్‌లోని పర్పల్లిలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.