Madhuri Dixit: వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురీ దీక్షిత్... లేటెస్ట్ ఫొటోలు ఇవిగో!

Madhuri Dixit latest pics

  • 1999లో వివాహం చేసుకున్న మాధురి
  • వైవాహిక జీవితంతో బిజీ
  • అయినప్పటికీ గ్లామర్ టచ్ వీడని వైనం
  • అప్పుడప్పుడు ఫొటో షూట్లు

అందం ఓ వరం. అలాంటి అందానికి అభినయం తోడైతే అది మాధురీ దీక్షిత్ అవుతుంది. కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన మాధురి ప్రస్తుతం వైవాహిక జీవితంలో తలమునకలుగా ఉన్నారు. అయినప్పటికీ తన సౌందర్య పోషణను మాత్రం విస్మరించడంలేదు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫొటోలే అందుకు నిదర్శనం.

 ఎంతో స్లిమ్ గా, ముఖంలో తేజస్సు ఉట్టిపడేలా మాధురి ఆ ఫొటోల్లో కనిపిస్తున్నారు. ఆ లేటెస్ట్ స్టిల్స్ చూసిన వాళ్లు ఎవరూ ఆమె వయసు 54 ఏళ్లంటే నమ్మలేరు. వైడ్ బాటమ్ ప్యాంట్స్ లో మాధురి ట్రెండీగా కనిపిస్తున్నారు. మరికొన్ని ఫొటోల్లో చీరకట్టులోనూ నవ్యత ప్రదర్శించారు. సంప్రదాయానికి ఆధునికత మేళవించిన ఆ దుస్తుల్లో మాధురి చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను మరోసారి ముగ్ధులను చేశారు.

.

  • Loading...

More Telugu News