EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ తేదీలు ఇవిగో!

Telangana govt announced EAMCET and ECET exams dates
  • షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
  • జులై 13న ఈసెట్
  • జులై 14 నుంచి 20 వరకు ఎంసెట్
  • 28 రీజినల్ సెంటర్లలో పరీక్షలు
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను నేడు వెల్లడించారు. జులై 13న ఈసెట్ జరగనుండగా, జులై 14 నుంచి ఎంసెట్ షురూ కానుంది. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఖరారైన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

కాగా, ఎంసెట్ పరీక్షలు 28 ప్రాంతీయ సెంటర్లలో 105 కేంద్రాల్లో జరపనున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈసారి ఎంసెట్ పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ర్యాంకులు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజి ఎంసెట్ కు ఉండదన్న సంగతి తెలిసిందే.
EAMCET
ECET
Exams
Dates
Telangana

More Telugu News