Jagan: చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజక్టుకు ఈ గతి పట్టింది: జగన్

All problems to Polavaram are due to Chandrababu says Jagan
  • కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు
  • స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారు
  • అన్ని సమస్యలను అధిగమించి పోలవరంను పూర్తి చేస్తామన్న సీఎం  
పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని అన్నారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజక్టును రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వీరికి ప్రధాని మోదీ ఏమైనా చెప్పారా? అని అడిగారు. ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. 2013-14 అంచనాల ప్రకారమే ప్రాజెక్టును కడతామని చెప్పారు.  

స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని జగన్ విమర్శించారు. మధ్యలో మూడు పెద్ద ఖాళీలను వదిలిపెట్టారని... ఈ నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని చెప్పారు. పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరంకు ఈ గతి పట్టిందని అన్నారు. అన్ని సమస్యలను అధిగమించి పోలవరంను పూర్తి చేసి తీరుతామని చెప్పారు.
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Polavaram Project

More Telugu News