Virat Kohli: కింగ్ కోహ్లీ వచ్చేశాడు.. ఆర్సీబీ తాజా ట్వీట్

Virat Kohli joins Royal Challengers Bangalore preparatory camp
  • శిక్షణా క్యాంపులోకి వచ్చి చేరిన కోహ్లీ
  • ఇంత కాలం రాకపోవడంతో అభిమానుల్లో ఆరాటం
  • ఫాప్ డూప్లెసిస్ సారథ్యంలో ఐపీఎల్ సమరం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ జట్టు ప్రాక్టీస్ క్యాంప్ కు కళ వచ్చేసింది. గత సీజన్ వరకు ఆర్సీబీకి కెప్టెన్ గా పనిచేసిన విరాట్ కోహ్లీ సైతం శిక్షణా క్యాంపులోకి సోమవారం వచ్చి చేరాడు. దీంతో ‘‘కింగ్ కోహ్లీ వచ్చేశాడు. అదే వార్త’’ అంటూ ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ పెట్టింది.  

దీంతో అభిమానుల్లో సందడి పెరిగింది. గత కొన్ని రోజులుగా అభిమానులు కోహ్లీ గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్ కు ఇతర ఆటగాళ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేయగా.. కోహ్లీ రాకపోవడంతో అభిమానుల్లో ఆరాటం ఎక్కువైంది. దీంతో కోహ్లీ రాకను ఆర్సీబీ ప్రకటించింది. కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. 

2008 ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీతోనే ఉంటున్నాడు. వచ్చే సీజన్ నుంచి తాను కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోనంటూ అతడు గతేడాదే ప్రకటించాడు. దీంతో ఇటీవలి వేలంలో సీఎస్కే మాజీ బ్యాటర్, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాప్ డూప్లెసిస్ ను కొనుగోలు చేసి, అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ‘‘కింగ్ ఎప్పుడూ ఆర్సీబీ రంగుల్లో చక్కగానే కనిపిస్తాడు. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమేమీ కాదు’’ అంటూ ఆర్సీబీ మరో ట్వీట్ చేసింది.
Virat Kohli
RCB camp
bangalore
ipl

More Telugu News