దసరాకి థియేటర్లలో దిగనున్న 'వీరమల్లు'
- 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్
- మొగల్ కాలంనాటి కథ
- నెక్స్ట్ షెడ్యూల్ కి సన్నాహాలు
- అక్టోబర్ 5వ తేదీన విడుదల
50 శాతం వరకూ చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. డిసెంబరులోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ప్రయత్నించినా కుదరలేదు. త్వరలోనే షూటింగును మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చని సమాచారం. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తరువాత 'భవదీయుడు భగత్ సింగ్' కోసం హరీశ్ శంకర్ తో కలిసి పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు.