Vijay: వెనకడుగు వేసేదే లేదంటున్న విజయ్!

Beast Movie Update
  • విజయ్ తాజా చిత్రంగా 'బీస్ట్'
  • కథానాయికగా పూజ హెగ్డే 
  • ఏప్రిల్ 14వ తేదీన విడుదల 
  • అదే రోజున రంగంలోకి 'కేజీఎఫ్ 2'
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కొంతకాలంగా ఆయన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను నమోదు చేస్తూ వెళుతున్నాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బీస్ట్' రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

విజయ్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అదే రోజున పాన్ ఇండియా స్థాయిలో 'కేజీఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ఇతర భాషల్లో ఏ సినిమా పోటీకి దిగడం లేదు.

ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కూడా వాయిదా పడొచ్చని అంతా అనుకున్నారు. కానీ  విజయ్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తన సినిమాను వాయిదా వేయడానికి లేదని తేల్చి చెప్పేశాడట. ఈ విషయంలో ఆయన కాస్త పంతానికి పోయినట్టుగానే చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఒక రోజు ముందుగానే 'బీస్ట్'ను వదలమని చెప్పాడట.  
Vijay
Pooja Hegde
Beast Movie

More Telugu News