Nara Lokesh: జగన్‌ను 'వాడూ వీడూ' అంటావా.. అంటూ సభలో లోకేశ్‌ పై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ap deputy cm narayana swamy fires on lokesh
  • సభలో ఐఎంఎఫ్ఎల్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  •  కల్తీ సారా అంటూ చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేయడం విడ్డూరమన్న నారాయణస్వామి 
  •  నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? అంటూ లోకేశ్ పై ఆగ్రహం 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి  నిండు సభలో టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో నిన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. కల్తీ మద్యం, కల్తీ సారా అంటూ చంద్రబాబు పదేపదే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ కల్తీ సారా వ్యాపారం చేశారని ఆరోపించారు. 

చంద్రబాబు రూ.550 కోట్ల మద్యం ముడుపులు స్వీకరించారంటూ ఏసీబీ కోర్టులో కేసు కూడా నడిచిందన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు. ఇక, లోకేశ్‌ను ఉద్దేశించి ‘ఒరేయ్ లోకేశ్ ముం.. నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? మా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని వాడూ వీడూ అంటావా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News