పార్లమెంటు భవనానికి చెల్లు.. సెంట్రల్ విస్టాలో శీతాకాల సమావేశాలు
- 44 శాతం నిర్మాణం పూర్తి అయిన సెంట్రల్ విస్టా
- ఇప్పటిదాకా రూ.480 కోట్ల ఖర్చు
- ఇంకో రూ.1,423 కోట్లతో మిగిలిన పనుల పూర్తి
- రాజ్యసభలో కేంద్రం ప్రకటన
కొత్త పార్లమెంటు భవన నిర్మాణంపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ సమాధానం ఇచ్చారు. ఇప్పటిదాకా సెంట్రల్ విస్టాలో 44 శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.480 కోట్లను ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఇంకో రూ.1,423 కోట్లను వెచ్చించాల్సి ఉందన్న ఆయన.. వచ్చే శీతాకాల సమావేశాలను సెంట్రల్ విస్టాలోనే నిర్వహించనున్నట్లుగా చెప్పారు.