Low Pressure: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు

Low pressure area over Bay of Bengal likely to intensify today
  • నేడు తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం
  • ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా రూపాంతరం
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది.

ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంట కదిలే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నానికి ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
Low Pressure
Bay Of Bengal
Andhra Pradesh
Rayalaseema
Coastal Andhra

More Telugu News