Chandrababu: చంద్రబాబును కలిసిన టీడీపీ ప్రేమజంట... నిశ్చితార్ధానికి రావాలంటూ ఆహ్వానం

TDP Love Couple met Chandrababu and invites to engagement
  • పార్టీ నేతల పిల్లల మధ్య ప్రేమ
  • ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెతో బోండా ఉమ కుమారుడికి నిశ్చితార్థం
  • ఈ నెల 27న కార్యక్రమం
  • చంద్రబాబును కలిసిన ఇరు కుటుంబాల వారు
టీడీపీ నేతలు బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కాబోతున్నారు. బోండా ఉమ కుమారుడు సిద్ధార్థ్, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి ప్రస్తుతం టీడీపీ ఎన్నారై విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. టీడీపీ కార్యకలాపాల సందర్భంగా వీరిరువురి మధ్య ప్రేమ వికసించింది. పెళ్లి చేసుకోవాలని భావించి, ఆ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఈ నెల 27న నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది. 

కాగా, తమ పిల్లల నిశ్చితార్ధానికి రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబును బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు చంద్రబాబు ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జశ్వంతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
.
Chandrababu
Bonda Uma
AV Subbareddy
Siddarth
Jaswanthi
Engagement
TDP
Andhra Pradesh

More Telugu News