KTR: అమెరికాలో కేటీఆర్ కు ఘనస్వాగతం పలికిన తెలంగాణ బిడ్డలు

Grand welcome for KTR in USA
  • పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్
  • 10 రోజుల పాటు పర్యటన
  • ప్రధాన నగరాల్లో సమావేశాలు
తెలంగాణ రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన ఇవాళ అమెరికా చేరుకోగా, తెలంగాణ ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. 

కాగా, కేటీఆర్ తన బృందంతో 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల్లో వివిధ బృందాలు, వ్యక్తులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు.
KTR
USA
Telangana
TRS

More Telugu News