West Bengal: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి వ‌స్తోంటే నా కారుపై బాంబు విసిరారు: బెంగాల్ ఎంపీ

bengal mp car attacked by miscreants
  • క‌ల‌క‌లం రేపుతోన్న‌ బీజేపీ నేత‌ జగన్నాథ్ సర్కార్ ఆరోప‌ణ‌లు
  • కొంద‌రు దుండ‌గులు ఈ ఘ‌ట‌నకు పాల్ప‌డ్డార‌న్న నేత‌
  • నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘ‌ట‌న‌
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి వ‌స్తోంటే త‌న‌ కారుపై బాంబు విసిరారని ప‌శ్చిమ‌ బెంగాల్ ఎంపీ, బీజేపీ నేత‌ జగన్నాథ్ సర్కార్ అన్నారు. నిన్న తాను 'ది కశ్మీర్ ఫైల్స్' చూసిన అనంతరం ఇంటికి వెళ్తుండ‌గా కొంద‌రు దుండ‌గులు ఈ ఘ‌ట‌నకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న వివ‌రించారు. 

నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స‌మాచారం. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు రోజురోజుకీ ఆద‌ర‌ణ పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దానిపై వివాదాలు కూడా రాజుకుంటున్నాయి. దీంతో ఆ సినిమా ద‌ర్శ‌కుడికి ఇప్ప‌టికే భ‌ద్ర‌త క‌ల్పించారు. 


West Bengal
BJP
Jammu And Kashmir

More Telugu News