Kerala: కేర‌ళ‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గ్యాల‌రీ కూలిపోయి 200 మందికి గాయాలు.. వీడియో ఇదిగో

Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday
  • మ‌లప్పురం పూంగోడ్ లో నిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ 
  • ప‌రుగులు తీసిన ప్రేక్షుకులు 
  • గాయ‌ప‌డ్డ వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మం
ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చి 200 మంది గాయాల‌పాల‌య్యారు. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా అక్క‌డి తాత్కాలిక‌ గ్యాల‌రీ ఒక్క‌సారిగా కూలిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. కేర‌ళ‌లోని మ‌లప్పురం పూంగోడ్ లో నిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ పోటీలు నిర్వ‌హించారు. అందుకోసం అక్క‌డ తాత్కాలిక‌ గ్యాల‌రీ ఏర్పాటు చేశారు. అయితే, అది ఒక్క‌సారిగా కూలిపోయింది. 

అది కూలిపోతోన్న స‌మ‌యంలో అక్క‌డి వారు ప‌రుగులు తీసిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. వేగంగా అది ప్రేక్ష‌కుల మీద ప‌డిపోవ‌డంతో దాదాపు 200 మందికి గాయాల‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వివ‌రించారు. తాత్కాలిక గ్యాల‌రీ కూలిపోయిన వీడియో మీడియాకు ల‌భ్య‌మైంది.
Kerala
Viral Videos

More Telugu News