WHO: కరోనా గురించి ఈ మూడూ తప్పుదోవ పట్టించేవి..: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Covid pandemic is not over WHO

  • ఇక కొత్త వేరియంట్లు రావన్నది అపోహ
  • తప్పుడు సమాాచారంతో అయోమయం
  • ప్రపంచవ్యాప్తంగా 8 శాతం పెరిగిన కేసులు
  • 1.1 కోట్ల కొత్త కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం కరోనా కొత్త కేసులు 8 శాతం పెరిగి 1.1 కోట్లుగా నమోదైనట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ తగ్గిన తరుణంలో ఎక్కువ కేసులు నమోదు కావడం పట్ల ఆందోళన తెలిపింది. 

కరోనాకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం ఎంతో వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ టెక్నికల్ విభాగం చీఫ్ డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. కరోనా ముగిసిపోయినట్టు, ఇదే చివరి వేరియంట్ అని, ఒమిక్రాన్ బలహీనమైన వేరియంట్ అని, వైరస్ కు సంబంధించి ఇక కొత్త వేరియంట్లు రావంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఇదంతా అయోమయానికి దారితీసి, ఇన్ఫెక్షన్ కేసులు పెరిగేందుకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. 

‘‘ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. బీఏ 1, బీఏ 2, బీఏ 3 ఇవి ఎంతో వేగంగా వ్యాపించే రకాలు’’అని డాక్టర్ కెర్కోవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News