Mahesh Babu: మహేశ్ మూవీపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

Mahesh Babu and Rajamoui project update
  • 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో బిజీగా రాజమౌళి
  • ఈ నెల 25వ తేదీన విడుదల 
  • తదుపరి ప్రాజెక్టు మహేశ్ బాబుతో 
  • అందులో బాలయ్య లేడన్న రాజమౌళి    
రాజమౌళి తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. 

అయితే మహేశ్ బాబు సినిమాలో బాలకృష్ణ గెస్టు రోల్ చేయనున్నాడనీ, ముఖ్యమైన పాత్రలోనే కనిపించనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ ఖండించకపోవడంతో నిజమేనని అనుకున్నారు. కానీ  తాజాగా ఈ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. 

'ఆర్ ఆర్ ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బెంగళూరు వెళ్లిన రాజమౌళికి, లోకల్ మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమాలో బాలకృష్ణ చేయనున్నారనే వార్తల్లో నిజం లేదు. మహేశ్ బాబు తప్ప మరో హీరో ఈ సినిమాలో ఉండరు .. ఇది మల్టీ స్టారర్ కాదు" అని స్పష్టం చేశారు. దాంతో ఇప్పటివరకూ షికారు చేస్తూ వచ్చిన ప్రచారానికి తెరపడింది.
Mahesh Babu
Rajamouli
Tollywood

More Telugu News