Dharmana Krishna Das: నా ఆస్తి మొత్తం రాసిస్తా: ధర్మాన కృష్ణదాస్ సవాల్

Jagan will become CM for second term also says Dharmana Krishna Das
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది
  • జగన్ మరోసారి సీఎం అవుతారు
  • అలా కాకపోతే నా ఆస్తి మొత్తం రాసిస్తానన్న కృష్ణదాస్ 
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని... జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జోస్యం చెప్పారు. జగన్ మరోసారి సీఎం కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి జగన్ లాంటి నాయకుడు మళ్లీ రాడని అన్నారు. 

ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని జగన్ ఆదేశించారని... ఆయన చెప్పిన ప్రకారం తాను ప్రతి ఇంటికి వస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయివలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Dharmana Krishna Das
Jagan
YSRCP
Telugudesam

More Telugu News