CPI Narayana: పవన్ తలతిక్కగా మాట్లాడుతూ క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: సీపీఐ నారాయణ

Pawan Kalyan is confusing Janasena cadre says CPI Narayana
  • జనసేన సభలో పవన్ తలతిక్కగా మాట్లాడారు
  • బీజేపీ, వైసీపీతో జనసేన కలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు
  • యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నా

మంగళగిరి సమీపంలోని ఇప్పటం వద్ద నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్యవ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరును సీపీఐ జాతీయ సెక్రటరీ నారాయణ తప్పుపట్టారు. ఎటూ కాకుండా పవన్ తలతిక్కగా మాట్లాడారని విమర్శించారు. బీజేపీ, వైసీపీ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారి మాదిరి వ్యవహరిస్తున్నాయని... వారితో జనసేన కలిసి ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు. 

అయితే పవన్ తలతిక్కగా మాట్లాడుతూ జనసేన క్యాడర్ ను కూడా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారని చెప్పారు. పార్టీలోని యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నానని అన్నారు. పవన్ అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని... అయితే ఆయన విధానాలు, నిలకడలేని తనం పట్లే తాము వ్యతిరేకతను తెలియజేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News