కళ్ల ముందు నీళ్లు కనిపించట్లేదా?... విపక్షాలపై హరీశ్ రావు ధ్వజం
- మల్లన్న సాగర్ నుంచి గండి చెరువుకు గోదావరి జలాలు
- విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ వచ్చాకే పొలాలకు నీళ్లొచ్చాయని వ్యాఖ్య
గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పొలాలకు నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. అన్నిరంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని హరీశ్ రావు పేర్కొన్నారు.