'సర్కారువారి పాట' .. పెన్నీ సాంగ్ ప్రోమోలో మెరిసిన సితార!
- పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
- మహేశ్ సరసన కీర్తి సురేశ్
- సంగీత దర్శకుడిగా తమన్
- మే 12న సినిమా రిలీజ్
ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా 'పెన్నీ' సాంగ్ ను ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించి ఒక ప్రోమోను వదిలారు. ఈ సాంగ్ లో మహేశ్ బాబు కూతురు సితార కూడా మెరిసింది. అప్పుడే సితార ఇంతలా ఎదిగిందా అనే ఆశ్చర్యం కలగకమానదు. ఈ సాంగ్ కి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
మొదటి నుంచి కూడా సితార డాన్సుల పట్ల ఆసక్తిని చూపుతూనే వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చింది. అందువల్లనే సితార ఇప్పడూ చాలా ఈజ్ తో స్టెప్స్ అదరగొట్టేసింది. దాంతో ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురుచూస్తూ కూర్చోవడం ఖాయం. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.