Nithin Chandra: హీరోగా ఎన్టీఆర్ బావమరిది ఎంట్రీ .. ఫస్టులుక్ రిలీజ్!

Sri Sri  Sri Rajavaru Movie First Look Released
  • హీరోగా నార్నె నితిన్ చంద్ర 
  • దర్శకుడిగా సతీశ్ వేగేశ్న 
  • సంగీత దర్శకుడిగా కైలాస్ మీనన్
  • టైటిల్ తో పెరుగుతున్న ఆసక్తి  

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎంట్రీకి సంబంధించిన వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వలన ఆయన సినిమాకి సంబధించి ఫస్టులుక్ పోస్టర్ బయటికి రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ సినిమాకి 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. 

చింతపల్లి రామారావు - ఎమ్మెస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, టైటిల్ తో కూడిన నితిన్ చంద్ర ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో నడుస్తూ .. సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్ లో ఆయన మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు.  కైలాస్ మీనన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన సతీశ్ వేగేశ్న, ఈ సారి ఇలాంటి ఒక మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం విశేషం. పైగా ఈ సినిమా టైటిల్ సిగరెట్లతో రాసుండటం కొసమెరుపు. ఈ సినిమాలో నాయిక ఎవరు? జోనర్ ఏమిటి? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది.

  • Loading...

More Telugu News