ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ నేతలవే: సోమిరెడ్డి
- ఊరూపేరూ లేని మద్యాన్ని జగన్ విక్రయిస్తున్నారు
- బ్రాండ్ల తయారీలో కనీస నాణ్యత కూడా ఉండటం లేదు
- ప్రతి ఏటా రూ. 5 వేల కోట్లను దోచుకుంటున్నారు
ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ మంత్రులు, ఎంపీలు, నేతలవేనని సోమిరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలో 28 మంది ప్రాణాలు కోల్పోక ముందే అక్కడున్న నాటుసారా నిల్వలను నాశనం చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ వినని మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నారని... ఆ బ్రాండ్ల తయారీలో కనీస నాణ్యత కూడా పాటించడం లేదని విమర్శించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.