GVL Narasimha Rao: వైసీపీని గద్దె దించడమే మా ప్రధాన లక్ష్యం: జీవీఎల్ నరసింహారావు

Our main ambition is to dethrone YSRCP says GVL Narasimha Rao
  • 2024లో బీజేపీ-జనసేనలదే అధికారం
  • రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
  • రాయలసీమ సమస్యలపై రేపు కడపలో రణభేరిని నిర్వహిస్తున్నాం
2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి అడుగులు వేస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ ప్రథమ లక్ష్యమని అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుందని చెప్పారు. 

బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ సమావేశమై బలమైన రాజకీయ వ్యూహాలను తయారు చేస్తామని తెలిపారు. విజయవాడలోని తన నివాసం వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ సమస్యలకు సంబంధించి కడపలో రేపు రణభేరిని నిర్వహించనున్నట్టు తెలిపారు.
GVL Narasimha Rao
BJP
Janasena
YSRCP

More Telugu News